KMR: విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకుని సమాజంలో ముందుకు పోవాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య సూచించారు. సోమవారం కళాశాలలో విద్యార్థుల స్వీయ రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు వాహనాలపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని ఆయన సూచించారు.