యూపీ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలకు సమాజ్వాదీ నేత అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో అంతర్గత సమస్యలు ఉన్నాయన్నారు. లక్నోలో ఉన్న యోగి, ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ మధ్య సఖ్యత సరిగా లేదన్నారు. ఆ విషయాన్ని సీఎం యోగి తన వ్యాఖ్యల్లో చెప్పినట్లు అఖిలేష్ వ్యాఖ్యానించారు. వందల కోట్ల దగ్గుమందు వ్యాపారం జరిగిందని, వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపించారు.