VSP: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అదే కారణంగా వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ చేరికల కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి కూడా చిల్డ్రన్స్ అరేనా రానివ్వకపోవడాన్ని ఆయన ఖండించారు. అలాగే చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామన్నారు.