MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఉపకులపతి ప్రొఫెసర్ జీ.ఎన్. శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే. ప్రవీణతో కలిసి భీఫార్మసీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్లాగ్ (59%), ఫార్మాడీ మొదటి సంవత్సరం (70%) పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆకాడమిక్ సెల్ జాయింట్ డైరెక్టర్ డా. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.