TG: ‘గ్రామపంచాయతీ కరదీపిక’ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామపంచాయతీల విధులపై 292 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ఇందులో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ అధికారుల విధులను పొందుపరిచారు. ఈ కరదీపికలను ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనంలో కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.