GNTR: నల్లపాడులోని MBTS ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. జిల్లాలోని 19 కళాశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు పలు సూచనలు చేశారు.