ELR: స్వామిత్వ రీసర్వే ద్వారా గ్రామాల్లోని భూములకి కచ్చితమైన సరిహద్దులు, భూ వివాదాలు సత్వరమే పరిష్కారం అవుతాయని, పెదవేగి ఎంపీడీవో నాగేంద్రకుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయితీ సొంత ఆదాయ వనరుల పెంపునకు సాంకేతిక వ్యూహాలు, రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ 2025-26లో మొదటి రోజు మండలస్థాయి శిక్షణా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు.