KNR: పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ. 50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ. 50 తగ్గించగా, తాజాగా మరో రూ. 50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010లకి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.