NDL: పుష్యమాసం సోమవారం విదియను పురస్కరించుకుని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులకు విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, రుద్రాభిషేకం, కుంకుమార్చన, సింధూరార్చన నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు.