NLR: సంగం బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేశారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు ఒకరికొకరు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాసేపు ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.