AP: విజయవాడ జైలులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కల్తీ నెయ్యి కేసులో ఆయనను ప్రశ్నించారు. నెయ్యి కాంట్రాక్ట్ మార్పుతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. కాగా ఇప్పటికే చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.