SDPT: బెజ్జంకి మండలంలో రేపు జరగనున్న నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఎటువంటి అనధికార ర్యాలీలు, డీజే సౌండ్లకు అనుమతి లేదని ఎస్సై సౌజన్య స్పష్టం చేశారు. అసంబద్ధ ప్రసంగాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.