వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ దంపతుల అనుచరుడు స్వప్న గౌడ్ ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం MLC బసవరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, పార్టీ కార్యకర్తలకు ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.