అనంతపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణలను కలిశారు. అచ్చెన్నాయుడుతో భేటీ అయి మార్కెట్ యార్డ్ సమస్యలు, పశువుల సంత, చీనీ మార్కెట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణను కలిసి నగరంలో డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.