ATP: ఉరవకొండలోని ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 107 రోజులకు గాను నగదు రూపంలో రూ. 23,81,397 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇంఛార్జ్ ఏసీ తిరుమల రెడ్డి తెలిపారు. వీటితో పాటు భక్తులు కానుకల రూపంలో 9.5 గ్రాముల బంగారం, 256 గ్రాముల వెండిని సమర్పించారని వెల్లడించారు.