WNP: రేవల్లి మండలం తలుపునూరులో ఆదివారం కుక్కల గుంపు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన దొడ్డి మల్లేష్‌కు చెందిన గొర్రెల మంద పొలంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ. 1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.