కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎర్రగుంట్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడే తత్వం, మంచి నాయకత్వ లక్షణాలు భూపేశ్కు ఉన్నాయని, ఆయన నాయకత్వంతో జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.