ఆకాశంలో ఎయిర్ఇండియా విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది. సాంకేతికలోపంతో ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోయింది. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. దీంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. టేకాఫ్ అయిన చోటే సురక్షితంగా ల్యాండ్ చేశారు. భద్రతా ప్రోటోకాల్స్ ఆధారంగా సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని ఎయిర్ ఇండియా పేర్కొంది.