AKP: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నిపేరు మార్చడం, రద్దు చేయాలనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా ఓబీసీ ఛైర్మన్ బొంతు రమణ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని నీరుగార్చడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు.