W.G: కలవపూడి సొసైటీ ద్వారా రైతులకు, ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తున్నామని త్రిసభ్య కమిటీ ఛైర్మన్ మంతెన చిననరసింహరాజు తెలిపారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో 2026 నూతన క్యాలెండరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు క్యాలెండర్‌తో పాటు హాట్ ఫ్లాస్క్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నరసింహారాజు, జానకిరామరాజు, రామారావు పాల్గొన్నారు.