NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కింద పనిచేయుచున్న క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్స్ అందరూ ఉద్యోగ భద్రత మరియు వేతనాల పెంపుదల కొరకు విజయవాడ ధర్నా చౌక్ నందు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎమ్మెల్సీలు వచ్చి వారి యొక్క మద్దతు తెలియజేశారు.