PPM: వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర వేడుకలు ఘనంగా హెచ్ ఎం. రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగాయి. మండల విద్యాశాఖ అధికారి గణిత శాస్త్ర ఎగ్జిబిషన్‌ను పర్యవేక్షించి హర్షం వ్యక్తం చేశారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శివప్రసాద్ తను రాసిన గీతాన్ని పిల్లల ముందు పాడి వినిపించారు.