ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బహుభాషా కవి మధు బావల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. జనవరి 2 నుంచి 5 వరకు పూణేలో జరగనున్న అంతర్జాతీయ ఫూలే ఫెస్టివల్‌కు కార్యక్రమ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికపై జిల్లా సాహిత్యవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.