ELR: గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి. నిర్మల కుమారి మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం, పంచుకోవడం విద్యార్థుల దైనందిన జీవితంలో అలవర్చుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ డా. కె. స్వరూపరాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.