VZM: వేపాడ మండలంలోని బల్లంకి సమీపంలో జగనన్న కాలనీలో బోరు మరమ్మతులకు గురవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. మూడు నెలలుగా బోరు పనిచేయడం లేదన్నారు. అందువల్ల మేము దూర ప్రాంతం నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి వచ్చిదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రిపైర్ చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు.