TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇవాళ 12 వేలకు పైగా గ్రామాల్లో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన పద్ధతిలో వారు ప్రమాణం చేశారు. కొందరు సర్పంచులు డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. గ్రామాలకు చేసే పనుల గురించి వివరించారు.