TG: పార్టీలు మార్చే ఊసరవెళ్లి CM రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్‌ది అని, పార్టీ అంటే తనకు కన్నతల్లి లాంటిదన్నారు. జాతి, నీతి విలువలు లేని నాయకుడివి నీవు.. తమ నాయకుడు ఆదేశిస్తే పదవులను గడ్డి పోచలాగా వదిలేశా అని తెలిపారు. తెలంగాణ ద్రోహిగా రేవంత్‌ను ప్రజల ముందు KCR నిలబెట్టారని పేర్కొన్నారు.