TG: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది కంటే అధికంగా 4,414 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు తగ్గాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. గతేడాది 4,618 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3,734 కేసులు నమోదయ్యాయని, ఆపరేషన్ ముస్కాన్ కింద 2,479 మందిని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ 1,071 మంది రెస్క్యూ చేశామన్నారు.