WGL: స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనరు వినతిపత్రం అందజేశారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారని సీపీఎం నాయకులు చుక్కయ్య, చక్రపాణి విమర్శించారు. ప్రజా సమస్యలపై బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యం వీడాలని వారు కోరారు.