SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ ఉన్నత పాఠశాల లో ప్రైమరీ లెవెల్ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈవో నాగారం శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… నాణ్యమైన గుణాత్మక విద్య ను అందించినప్పుడే సమాజం పురోగతిన సాధిస్తుందన్నారు. విద్యా వేత్తలు కలలు కన్న నూతన సమాజం ఆవిర్భవిస్తుందన్నారు. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటా నమోదు పూర్తి చేసి సహకరించాలని సూచించారు.