AP: మంగళగిరిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. ప్రతి అర్జీపై తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.