MBNR: పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ, సామాజిక అభివృద్ధికోసం కృషిచేసిన దివంగత మాజీ ఎంపీ జి వెంకటస్వామి చిరస్మరణీయుడని ఎస్పీ జానకి కొనియాడారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలతో ఎస్పీ నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఆయన ప్రదర్శించిన సేవాభావం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.