కోనసీమ: అమలాపురం పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక మెట్ల కాలనీలోని ఓ ఇంటిలో ఉంటున్న బీవీసీ కళాశాల విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. బీబీఏ మొదటి సంవత్సరం విద్యార్థి కొప్పన దీపక్ రాజ్ చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు పెట్టుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు అనుమానిస్తున్నారు.