SRD: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో గణిత మేళా క్విజ్ కార్యక్రమాలను నిర్వహించారు. రామానుజన్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం గుర్తించ దగిన గణిత మేధావిగా ఎదిగిన తీరుపై ఫోటో మేళ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించామని ఇంఛార్జ్ హెచ్ఎం లక్ష్మణ్ తెలిపారు. ఇందులో గణిత ఉపాధ్యాయులు ఉన్నారు.