కృష్ణా: వెన్ననపూడి జడ్పీహెచ్ పాఠశాల కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో విద్యార్థులు జిల్లా స్థాయిలో 2వ బహుమతి (2nd Prize) సాధించినట్లు స్కూల్ హెచ్ఎం ఎన్.వై. మాధవ్ కుమార్ సోమవారం తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన ఆయన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధించారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.