AP: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కారు ప్రమాదం జరిగింది. సచివాలయం ఔట్ గేట్ నుంచి కారు వేగంగా లోపలికి దూసుకొచ్చి కియా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఢీకొట్టింది. దీంతో ఛార్జింగ్ స్టేషన్ గోడ దెబ్బతింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పిందని డ్రైవర్ తెలిపాడు.