SS: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ శ్యాంప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా, ఆయనే స్వయంగా వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.