ATP: రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ తుల్జాపూర్ స్వప్న సోమవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు.