KRNL: నూజెండ్ల మండలం పెద్దవరం పాఠశాలలో సోమవారం గణిత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన గణిత నమూనాలు, పోస్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. రామానుజన్ జీవిత విశేషాలను, నిత్యజీవితంలో గణితం ప్రాముఖ్యతను హెచ్ఎం నాగేశ్వరరావు వివరించారు.