MDK: రేగోడ్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా పర్వీన్ సుల్తానా చోటుమియా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ దత్తురెడ్డి, సర్పంచ్ పర్వీన్ సుల్తానా, ఉపసర్పంచ్ ధనలక్ష్మి మల్లికార్జున్ సహా వార్డు సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ఆయన చెప్పారు.