GNTR: గుంటూరు జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావును సోమవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అభినందించారు. గుంటూరులోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల కార్యాలయంలో మాణిక్యరావును నరేంద్ర కుమార్ శాలువాతో సత్కరించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.