ADB: పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.