KNR: జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామ నూతన సర్పంచిగా గుంటి లావణ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ వేడుకలో ఆమె ధరించిన ‘ఇందిరమ్మ చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది నిజమైన ప్రజాపాలనకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.