ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగం భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత గల 24-35 వయస్సు గల యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.