NLG: చందుపట్లను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా గెలుపొందిన దీగోజు లత – వెంకటాచారి, పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.