MDK: స్థానిక ఎక్సైజ్ కార్యాలయ సమీపంలో రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, జీ+2 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.