NDL: ఆన్ లైన్ పనుల కోసం మొబైల్ ఫోన్లు లేక ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 5జీ ఫోన్లను పంపిణీ చేశారు. సీడీపీవో తేజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఆధునిక ఫోన్లు అందజేశామన్నారు. గత కొన్నేళ్లుగా ఉన్న సమస్య పరిష్కారం కావడంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేశారు.