ADB: సోయా పంటను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారిపై రైతులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పంట కొనుగోలులో క్వింటాల్ నిబంధన పేరుతో ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.