NLG: మిర్యాలగూడ పట్టణానికి చెందిన మునుకుంట్ల లక్ష్మీనారాయణ ఇటీవల ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో సీఐడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ఆయనను సన్మానించారు. నిరుపేద కుటుంబం యువకుడు ప్రభుత్వ ఉద్యోగం పొందడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.