WNP: నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను అభివృద్ధిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.